సూపర్ హిట్ సినిమా రీమేక్ లో యువ హీరో !

Published on Dec 19, 2018 10:42 am IST

‘ఇష్క్ , గుండెజారి గల్లంతయ్యిందే’ లాంటి సాలిడ్ హిట్ కోసం చాలా రోజులగా ఎదురుచూస్తున్నాడు యంగ్ హీరో నితిన్. ఇటీవల ఆయన నటించిన ‘లై , చల్ మోహన్ రంగ , శ్రీనివాస కళ్యాణం’ చిత్రాలు పరాజయాన్ని మిగిల్చాయి. దాంతో మళ్ళీ సక్సెస్ ట్రాక్ లో రావాలని నితిన్ సినిమాల ఎంపిక విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తున్నాడు.

ఇక తాజాగా ఆయన తమిళ సూపర్ హిట్ ‘రట్సాసన్’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడని సమాచారం. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఈ ఈఏడాది ఇండియాలో అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రాల్లో రెండవ స్థానంలో నిలిచింది. దాంతో ఇలాంటి సినిమాను తెలుగులో రీమేక్ చేస్తే తను అనుకున్న విజయాన్ని సాధించవచ్చు అనే నమ్మకం తో ఈ చిత్రం యొక్క తెలుగు హక్కులను దక్కించుకున్నాడట నితిన్.

అయితే ఈచిత్రం తోపాటు ‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో ‘భీష్మ’ అనే చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట నితిన్. మరి ఈ రెండు చిత్రాల్లో మొదటగా ఏ చిత్రాన్ని పట్టాలెక్కిస్తాడో చూడాలి.

సంబంధిత సమాచారం :