ప్లాప్ డైరెక్టర్ తో మరో సారి రిస్క్ చేస్తున్న నితిన్ !

ప్లాప్ డైరెక్టర్ తో మరో సారి రిస్క్ చేస్తున్న నితిన్ !

Published on Mar 30, 2019 9:20 AM IST

nithin

రౌడీ ఫెలో తో డైరెక్టర్ గా పరిచయమయ్యాడు లిరిసిస్ట్ కృష్ణ చైతన్య. నారా రోహిత్ నటించిన చిత్రం యావరేజ్ రెస్పాన్స్ ను రాబట్టుకుంది. ఇక ఈ చిత్రం తరువాత గ్యాప్ తీసుకుని నితిన్ తో చల్ మోహన్ రంగ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈసినిమా కూడా విజయం సాధించలేదు. అయినా కూడా నితిన్ మరో సారి ఈ దర్శకుడికే అవకాశం ఇచ్చాడు.

భీష్మ , చంద్రశేఖర్ యేలేటి సినిమాలతో పాటు కృష్ణ చైతన్య తో కూడా ఒక సినిమా చేయనున్నాని నితిన్ ప్రకటించాడు. శ్రేష్ట్ మూవీస్ నిర్మించనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదలకానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు