
హాట్ బ్యూటీ ఛార్మీ ప్రసతుతం ఉన్న పొజిషన్ కి ‘ఎరక్కపోయి ఇరుక్కుపోవడం’ అనే సామెత బాగా సెట్ అవుతుంది. ఎందుకు అంటే ఎవరో చెప్పిన మాటలు విని అది నిజమే అని బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చేసి, ఆ తర్వాత అది తప్పని తెలుసుకొని నాలికకరుచుకొని సారీ చెప్పినా సమస్యలు మాత్రం ఛార్మీని వెంటాడుతూనే ఉన్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే పూరి జగన్నాధ్ – నితిన్ కాంబినేషన్ లో రావాల్సిన సినిమా ఆగిపోయింది. ఆ సినిమా ఆగిపోవడానికి ఫైనాన్సియల్ ఇబ్బందులే కారణం అని స్టేట్మెంట్ ఇచ్చిన ఛార్మీ అది తప్పని తెలుసుకొని సోషల్ మీడియాలో సారీ చెప్పింది.
కానీ ఈ విషయం వల్ల బాగా బాధకి లోనైన నితిన్ ఫాదర్ సుధాకర్ రెడ్డి సారీతో శాంతించకుండా ఛార్మీ పై ఫిల్మ్ చాంబర్ లో కంప్లైంట్ ఇచ్చాడు. సుధాకర్ రెడ్డి ‘తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లో ఛార్మీ చేసిన వ్యాఖ్యలు తనకి ఇబ్బంది కలిగించాయని కంప్లైంట్’ చేసారు. ఈ విషయంపై త్వరలోనే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ చర్చ జరపనుంది. అంతే కాకుండా సుధాకర్ రెడ్డి గారు తన లాయర్స్ ద్వారా ఛార్మీ పై పరువు నష్టం కేసు కూడా వెయ్యాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం అఖిల్ తో భారీ బడ్జెట్ సినిమా చేస్తున్న సుధాకర్ రెడ్డి నైతిక స్థితి ఈ కామెంట్స్ వల్ల దెబ్బతిందని, అందుకే ఆయన కేసు ఫైల్ చెయ్యాలనే ఆలోచనలో ఉన్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మరి ఈ విషయం ఎక్కడికి వెళ్లి ఆగుతుందో, ఛార్మీ ఈ కేసుపై ఎలా స్పందిస్తుందో అనేది చూడాలి.