నితిన్- కార్తీక్ ల ఆల్బమ్ కి రెస్పాన్స్ అదిరిందిగా.!

Courier-Boy-Kalyan
నితిన్ కెరీర్లో సూపర్ హిట్స్ గా నిలిచిన ‘ఇష్క్’, ‘గుండెజారి గల్లంతయ్యిందే’, ‘హార్ట్ అటాక్’, ‘చిన్నదానా నీకోసం’ లాంటి రొమాంటిక్ ఎంటర్టైనర్స్ అన్నీ మ్యూజికల్ గా కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు నితిన్ హీరోగా రానున్న మూవీ ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’. సింగర్ గా మంచి పేరున్న కార్తీక్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయం చేస్తూ చేసిన ఈ మూవీ ఆడియో ఇటీవలే విడుదలైంది. ఈ సినిమాలోని పాటలకి రెస్పాన్స్ చాలా బాగా వస్తోంది. ఈ సినిమాలోని రెండు మెలోడీ సాంగ్స్ అందరికీ బాగా నచ్చేయడమే కాకుండా లేటెస్ట్ హిట్ సాంగ్స్ చార్ట్ లో టాప్ లో ఉన్నాయి.

చిన్నదానా నీకోసం తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న నితిన్ ఆ గ్యాప్ ని ఈ సినిమాతో కవర్ చేయడానికి ఈ నెల 11వ తేదీన తెలుగు ప్రేక్షకుల ముందకు వస్తున్నాడు. గౌతమ్ మీనన్ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా ద్వారా తన అసిస్టెంట్ ప్రేమ్ సాయి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. గురు ఫిలిమ్స్ – మల్టీ డైమెన్షన్స్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో యామి గౌతమ్ హీరోయిన్. త్వరలోనే ఈ సినిమా ప్రమోషన్స్ ని మొదలు పెట్టనున్నారు. ఇది కాకుండా నితిన్ త్రివిక్రమ్ డైరెక్షన్ లో తన తదుపరి సినిమా చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

Exit mobile version