నితిన్ కెరీర్ లోనే ఆ సినిమా ప్రత్యేకంగా.. !

Published on Apr 14, 2019 9:21 pm IST

ప్రస్తుతం నితిన్ వరుస చిత్రాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. వెంకీ కుడుముల దర్శకత్వంలో ‘భీష్మా’లో, అలాగే చంద్రశేఖర్‌ ఏలేటి దర్శకత్వంలో మరో సినిమాతో పాటు కృష్ణ చైతన్య దర్శకత్వంలో మరో సినిమాను కూడా చేయబోతున్నాడు నితిన్. అయితే కృష్ణ చైతన్య దర్శకత్వంలో రాబోతున్న చిత్రానికి సంబంధించిన కథ చాలా వైవిధ్యంగా ఉంటుందట.

నితిన్ కెరీర్ లోనే ఈ సినిమా ప్రత్యేకంగా నిలిచిపోతుందని.. అందుకే నితిన్ తన సొంత బ్యానర్ శ్రేష్ట్ బ్యానర్ పైనే ఈ సినిమాను నితిన్ తండ్రి సుధాకర్‌ రెడ్డి నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :