“భీష్మ” సినిమాపై “రంగ్‌దే” సినిమాది పైచేయి..!

Published on Jul 2, 2021 4:00 am IST


టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ కెరిర్‌లో ‘భీష్మ’ సినిమా బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. విమర్శకుల ప్రశంసలను దక్కించుకోవడమే కాకుండా, కలెక్షనను కూడా ఈ సినిమా దండిగానే రాబట్టుకుంది. అయితే ఇలాంటి భీష్మ సినిమాపై అదే నితిన్ హీరోగా చేసిన రంగ్ దే సినిమా పైచేయి సాధించింది. అది ఎలా సాధ్యం రంగ్‌దే సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదనేగా మీ సందేహం..! అక్కడికే వస్తున్నా..!

వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా జీ తెలుగులో రీసెంట్ గా ‘రంగ్ దే’ సినిమాను ప్రసారం చేయగా అది ఏకంగా 7 టీఆర్ఫీనీ రాబట్టుకుంది. అయితే గతంలో భీష్మ సినిమాను జెమినీ ఛానెల్‌లో ప్రసారం చేస్తే 6.65 రేటింగ్ మాత్రమే వచ్చింది. నిజానికి ఈ సినిమాలు టీవీలో ప్రసారం చేయడానికి ముందే జీ5 యాప్‌లో స్ట్రీమింగ్ కు పెట్టారు. కాగా బ్లాక్ బస్టర్ అయిన ‘భీష్మ’ సినిమా కంటే యావరేజ్‌గా ఆడిన ‘రంగ్ దే’ సినిమాకే టీవీలో ఎక్కువ మార్కులు పడడం ఇక్కడ చెప్పుకోదగ్గ విశేషం.

సంబంధిత సమాచారం :