అఫీషియల్ : నితిన్, రష్మిక న్యూ మూవీ అనౌన్స్ మెంట్

Published on Mar 22, 2023 6:04 pm IST

నితిన్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా వెంకీ కుడుముల దర్శకత్వంలో ఇటీవల ప్రేక్షకుల ముందుకి వచ్చి మంచి సక్సెస్ అందుకున్న మూవీ భీష్మ. ఈ సినిమా విజయంతో వీరు ముగ్గురి కాంబినేషన్ పై అందరిలో మంచి ఆసక్తి ఏర్పడింది. ఇక తాజా మరొక్కసారి ప్రముఖ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ పై వీరు ముగ్గురూ కలిసి ఒక సినిమా చేసేందుకు సిద్ధం అయ్యారు. కాగా ఈ క్రేజీ కాంబో మూవీ యొక్క అఫీషియల్ అనౌన్స్ మెంట్ కొద్దిసేపటి క్రితం ఒక కాన్సెప్ట్ వీడియోగా రిలీజ్ చేసారు. నితిన్ మరియు రష్మిక ఒకరి కాళ్లు మరొకరు లాగుతూ కనిపిస్తారు, తరువాత దీనికి మ్యూజిక్ అందించనున్న జి.వి.ప్రకాష్ కుమార్ సడన్ గా ఎంట్రీ ఇస్తారు.

ఇక కెప్టెన్ అయిన డైరెక్టర్ వెంకీ కుడుముల చివరగా రావడం, ఈ సినిమా తన మునుపటి సినిమాలైన భీష్మ, ఛలోలా కాకుండా డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఉంటుందని చెప్తారు. అనంతరం ఒక వ్యక్తి బైక్ నడుపుతున్నట్లు చూడవచ్చు మరియు బ్యాక్ గ్రౌండ్ లో ప్లే చేయబడిన సంగీతం ఆకట్టుకుంటుంది. అలానే బైక్ నంబర్ ప్లేట్‌పై నేను చాలా అరుదైన వ్యక్తినని నాకు తెలుసు అని రాసి ఉంటుంది. అయితే సినిమా టైటిల్ ఏమిటని నితిన్, రష్మిక ఇద్దరూ దర్శకుడిని అడగడం, టైటిల్‌ను అతి త్వరలో వెల్లడిస్తానని ఆయన చెప్పడం జరుగుతుంది. మొత్తంగా వీరి క్రేజీ మూవీ నాలుగు నిమిషాల అనౌన్స్ మెంట్ వీడియో అయితే అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ మూవీకి సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ ప్రవీణ్ పూడి అందించనున్నారు.

సంబంధిత సమాచారం :