‘భీష్మ’ ఫస్ట్ గ్లిమ్ప్స్…, నితిన్ చించేశాడు.

Published on Nov 7, 2019 10:35 am IST

ప్రకటించిన విధంగానే నితిన్ లేటెస్ట్ మూవీ ‘భీష్మ’ ఫస్ట్ గ్లిమ్ప్స్ వీడియో నేడు విడుదల చేశారు. ‘నడుముకుడా విజయ్ మాల్యా లాంటిదిరా…, కనిపిస్తుంటది కానీ క్యాచ్ చేయలేమ్’ అని నితిన్ రష్మిక అందమైన నడుమును ఉదేశిస్తూ చెప్పిన డైలాగ్ తో మొదలైన వీడియో చాలా రొమాంటిక్ గా ఉంది. శారీలో రష్మిక మందన్నా బ్యూటిఫుల్ గా ఉంది. దర్శకుడు వెంకీ కుడుముల భీష్మ చిత్రాన్ని అవుట్ అండ్ అవుట్ లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించాడని ఫస్ట్ గ్లిమ్ప్స్ వీడియో చూస్తే అర్థం అవుతుంది. ఫస్ట్ గ్లిమ్ప్స్ విడియోతోనే భీష్మ టీం మూవీపై అంచలనాలు పెంచేసింది.

ఈ లవ్ ఎంటర్టైనర్ ని వచ్చే ఏడాది ఫిబ్రవరి 21న విడుదల చేస్తున్నట్లు రిలీజ్ డేట్ కూడా వీడియో లో ప్రకటించేశారు. మొత్తానికి నితిన్ 2020లో భీష్మ తో ఫస్ట్ హిట్ అందుకుంటారు అనిపిస్తుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, మహంతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు.

వీడియో కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :

X
More