‘భీష్మ’ కోసం డబ్బింగ్ మొదలెట్టిన నితిన్ !

Published on Sep 12, 2019 12:14 am IST

నితిన్ హీరోగా ‘ఛలో’ దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో రానున్న ‘భీష్మ’ చిత్రం క్రిష్టమస్ సందర్భంగా విడుదల కానుందని చిత్రబృందం ఇటీవలే పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా తాజాగా ఈ సినిమా కోసం నితిన్ తన పాత్రకు డబ్బింగ్ చెప్పడం మొదలుపెట్టారు. ఇక ఈ సినిమాలో కామెడీ చాల బాగా వస్తోందని తెలుస్తోంది. ముఖ్యంగా వెన్నల కిశోర్ అండ్ నితిన్ ట్రాక్ సినిమాలో హైలెట్ అవుతుందని సమాచారం. మొత్తానికి వెంకీ కుడుముల ‘ఛలో’ మాదిరిగానే ఈ చిత్రాన్ని కూడా ఫుల్ ఎంటెర్టైనింగా మలుస్తున్నాడు.

ఇక ఈ చిత్రంలో ఒక కీ రోల్ కోసం హెబ్బా పటేల్ ను తీసుకున్న విషయం తెలిసిందే. కాగా సినిమాలో హెబ్బా పటేల్ పాత్ర నెగిటివ్ షేడ్స్ తో ఉంటుందని టాక్. మరి హెబ్బాకి ఈ చిత్రంతోనైనా ఆమె ఆశించిన బ్రేక్ ఆమెకు దక్కుతుందేమో చూడాలి. నితిన్ కూడా భీష్మ పై చాలా ఆశలే పెట్టుకున్నాడు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నితిన్ సరసన రష్మిక మండన్నా హీరోయిన్ గా నటిస్తోంది.

సంబంధిత సమాచారం :

X
More