హిట్ దర్శకుడితో సినిమా ప్రకటించిన నితిన్ !

‘ఛలో’ సినిమాతో మంచి విజయం సాదించిన దర్శకుడు వెంకి కుడుముల దర్శకత్వంలో ఒక సినిమా చెయ్యబోతున్నట్లు నితిన్ తాజా ఇంటర్వ్యూలో వెల్లడించాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమాను చినబాబు నిర్మించనున్నారు. నితిన్ నటించిన తాజా సినిమా ‘ఛల్ మోహన్ రంగ’ ఏప్రిల్ 5 న విడుదల కానుంది. మేఘా ఆకాష్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందించడం జరిగింది.

వెంకి కుడుముల సినిమాతో పాటు హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చెయ్యబోతున్నాడు నితిన్. ఈ సినిమాలో శర్వానంద్ మరో హీరోగా నటించబోతున్నాడు. జూన్ లేదా జులైలో నుండి ఈ సినిమా ప్రారంభంకానుంది.