టాలెంటెడ్ డైరెక్టర్ తో నితిన్ సినిమా ?

టాలెంటెడ్ డైరెక్టర్ తో నితిన్ సినిమా ?

Published on Jun 2, 2018 9:14 AM IST


హీరో నితిన్ ప్రస్తుతం సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ‘శ్రీనివాస కళ్యాణం’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సగానికి పైగా షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా తరవాత చేయబోయే సినిమాపై నితిన్ ఇంకా అధికారిక ప్రకటన ఏమీ చేయలేదు. కానీ సినీ వర్గాల్లో వినిపిస్తున్న వార్తల మేరకు నితిన్ తరవాతి చిత్రం టాలెంటెడ్ డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఉంటుందని తెలుస్తోంది.

చంద్రశేఖర్ నితిన్ కోసం ఒక థ్రిల్లింగ్ సబ్జెక్ట్ తయారుచేశారని, నితిన్ కూడ ఆ కథ పట్ల సుముఖంగానే ఉన్నారని అంటున్నారు. మరి నితిన్ చంద్రశేఖర్ దర్శకత్వంలో నటిస్తాడో లేదో తెలియాలంటే అధికారిక ప్రకటన వెలువడే వరకు వేచి చూడాల్సిందే. చంద్రశేఖర్ ఏలేటి గతంలో ‘సాహసం, ఒక్కడున్నాడు అనుకోకుండా ఒక రోజు, మనమంతా’ లాంటి మంచి సినిమాల్ని ప్రేక్షకులకు అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు