జయలలిత పాత్రలో నటించడానికి సిద్దమవుతున్న నిత్య !

nitya menon
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి, పురుచ్చితలైవి జయలలిత నిజ జీవితం ఆధారంగా ‘ది ఐరన్ లేడీ’ అనే టైటిల్ తో ఒక బయోపిక్ తెరకెక్కనుందని తెలిసిందే. లేడీ డైరెక్టర్ ప్రియదర్శిని తెరకెక్కించనున్న ఈ చిత్రంలో జయలలిత పాత్రలో నిత్య మీనన్ నటించనుంది. ప్రస్తుతం ఈ పాత్రకోసం ఆమె బరువు పెరిగే పనిలో వున్నారు. తర్వలోనే ఈచిత్రం యొక్క షూటింగ్ స్టార్ట్ కానుంది.

అయితే తమిళుల ఆరాధ్య ధైవమైన ‘అమ్మ’ పాత్రలో నటించడం నిత్య మీనన్ కు సవాలుతో కూడుకున్న పనే. మరి ఆ పాత్రలో నటించి తమిళ ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి. ఇక నిత్య మీనన్ ప్రస్తుతం తెలుగులో ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో మహానటి సావిత్రి పాత్రలో నటిస్తుంది.

Exit mobile version