తలైవా కు కూతురుగా యంగ్ హీరోయిన్ !

Published on Apr 9, 2019 12:00 am IST

పేట తరువాత సూపర్ స్టార్ రజినీకాంత్ తన 166 వచిత్రాన్ని ఏఆర్ మురుగదాస్ తో చేయనున్నాడని తెలిసిందే. ఈ చిత్రం యొక్క షూటింగ్ ఏప్రిల్ 10నుండి స్టార్ట్ కానుంది. ఇక ఈ చిత్రంలో యంగ్ హీరోయిన్ నివేతా థామస్, రజినీ కూతురుగా కనిపించనుందని సమాచారం. ముంబై బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో రజినీ పోలీస్ ఆఫిసర్ గా నటించనుండగా ఆయనకు జోడిగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటించనుంది. వీరితో పాటు రజినీ ఫ్రెండ్ పాత్రకు ఎస్ జె సూర్య ను తీసుకున్నారట.

అనిరుద్ సంగీతం అందించనున్న ఈ చిత్రాన్నీ లైకా ప్రొడక్షన్స్ నిర్మించనుంది.ఈ చిత్రం వచ్చే ఏడాది పొంగల్ కు విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :