నెక్ట్స్ ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇచ్చిన నివేదా థామ‌స్

నెక్ట్స్ ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇచ్చిన నివేదా థామ‌స్

Published on Jun 24, 2024 9:00 PM IST

మ‌ల‌యాళ భామ నివేదా థామస్ టాలీవుడ్ లో ప‌లు హిట్ చిత్రాల్లో న‌టించి మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. జెంటిల్ మెన్, నిన్ను కోరి, జై ల‌వ కుశ‌, బ్రోచేవారెవ‌రురా, వ‌కీల్ సాబ్ వంటి సినిమాల్లో త‌న ప‌ర్ఫార్మెన్స్ తో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది.

నివేదా థామ‌స్ చివ‌ర‌గా ‘శాకిని డాకిని’ మూవీలో క‌నిపించింది. ఆ త‌రువాత ఆమె ఏ సినిమాను ఓకే చేయ‌లేదు. అయితే, తాజాగా త‌న నెక్ట్స్ ప్రాజెక్ట్ పై నివేదా ఓ స‌ర్ ప్రైజ్ ఇచ్చింది. టాలీవుడ్ హీరో రానా ద‌గ్గుబాటి స‌మ‌ర్ఫ‌ణ‌లో తెర‌కెక్కుతున్న ఓ సినిమాలో నివేదా న‌టిస్తోంది. ఈ సినిమాను నంద కిషోర్ ఈమ‌ని డైరెక్ట్ చేస్తుండ‌గా, వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు.

కొంచెం గ్యాప్ త‌రువాత వ‌స్తున్న నివేదా థామ‌స్ ఈ సినిమాతో సాలిడ్ క‌మ్ బ్యాక్ ఇవ్వాలని అభిమానులు కోరుతున్నారు. ఇక ఈ సినిమాలో ప్రియ‌ద‌ర్శి, విశ్వ‌దేవ్ ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ ను జూన్ 25న రివీల్ చేయ‌నుండ‌గా, ఈ చిత్రాన్ని ఆగ‌స్ట్ 15న రిలీజ్ చేస్తున్న‌ట్లు మేక‌ర్స్ తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు