నెటిజెన్స్ పై నివేదా థామస్ ఫైర్

నెటిజెన్స్ పై నివేదా థామస్ ఫైర్

Published on Nov 9, 2019 10:24 PM IST

Nivetha Thomas

యంగ్ బ్యూటీ నివేథా థామస్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో చాట్ సెషన్‌లో పాల్గొన్నారు. ఐతే కొందరు ఆమెను కొన్ని అసభ్యకర ప్రశ్నలతో ఇబ్బందిపెట్టారు. దీంతో చాట్ ముగిసిన అనంతరం ఆమె ‘నాతో మాట్లాడటానికి టైమ్ కేటాయించినందుకు థ్యాంక్స్. చాలామంది ప్రశ్నలకు నేను సమాధానం చెప్పాను. కానీ కొంతమంది నన్ను అసహ్యమైన ప్రశ్నలు కూడా అడిగారు. వాటికి నేను సమాధానాలు చెప్పలేదు. మీరు మాట్లాడేది కూడా ఒక మనిషితోనే అని తెలుసుకోండి. అందరికీ మర్యాద ఇవ్వండి. త్వరలో మళ్లీ కలుద్దాం అంటూ ముగించింది.

అయితే సాధారణంగా ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడం కోసం హీరోహీరోయిన్లు చాలా కష్టపడుతుంటారు. తమ బాధలను తమలోనే దాచుకొని మరీ.. షూటింగ్‌కు వెళ్లిన హీరోహీరోయిన్లు చాలామందే ఉన్నారు. ఒకవేళ తమకు ఏ నటీనటులైనా నచ్చకపోతే అభిమానించకపోయినా పర్లేదు గానీ.. ఇలాంటి అసభ్యకర వ్యాఖ్యలు చేయడం మాత్రం నిజంగా బాధాకరమే.

తాజా వార్తలు