వ్యూహం లోకి మరో హీరోయిన్ !

Published on Apr 14, 2019 3:44 pm IST

మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నాని , సుధీర్ బాబు కలిసి వ్యూహం అనే మల్టీ స్టారర్ చిత్రం లో నటించనున్నారని తెలిసిందే. ఈసినిమాలో అదితి రావ్ హైదరి ను ఒక హీరోయిన్ గా ఎంపిక చేయగా తాజాగా నివేత థామస్ మరో హీరోయిన్ గా తీసుకున్నారని సమాచారం. అయితే ఈ ఇద్దరి హీరోయిన్లు ఎవరికీ జోడిగా నటిస్తారో తెలియాల్సి ఉంది. దిల్ రాజు నిర్మించనున్న ఈ చిత్రం జూలై నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది.

కాగా ఇంతకుముందు మోహన్ కృష్ణ దర్శకత్వంలో నాని ,నివేత కలిసి జెంటిల్మెన్ అనే చిత్రంలో నటించగా అదితి, సుధీర్ బాబు కలిసి సమ్మోహనం అనే చిత్రంలో నటించారు. ఈరెండు కూడా మంచి విజయాలను సాధించాయి.

సంబంధిత సమాచారం :