కళ్యాణ్ రామ్ 16 టైటిల్ విడుదలకు ముహూర్తం ఫిక్స్ !

కళ్యాణ్ రామ్ 16 టైటిల్ విడుదలకు ముహూర్తం ఫిక్స్ !

Published on Dec 2, 2018 6:22 PM IST

‘నా నువ్వే’ తరువాత నందమూరి కళ్యాణ్ రామ్ ప్రస్తుతం తన 16వ చిత్రంలో నటిస్తున్నాడు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ డైరక్టర్ గా మారి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నివేత థామస్ అలాగే ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ షాలిని పాండే హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఈ చిత్రం యొక్క టైటిల్ ను రేపు ఉదయం 10:30 గంటలకు రివీల్ చేయనున్నారు.

థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకం ఫై మహేష్ ఎస్ కోనేరు నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు