‘కెజిఎఫ్-2’ రిలీజ్ డేట్ మారలేదు

Published on May 31, 2021 11:24 pm IST

కన్నడ హీరో యాష్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వచ్చిన ‘కెజిఎఫ్’ చిత్రం ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిన సంగతే. కన్నడతో పాటు తెలుగు, హిందీ, తమిళంలో భారీ వసూళ్లను సాధించిందీ చిత్రం. ప్రస్తుతం దీనికి కొనసాగింపుగా ‘కెజిఎఫ్ 2’ రూపొందింది. ఈ చిత్రం కోసం అన్ని భాషల ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కానీ లాక్ డౌన్ మూలంగా ఇప్పటికే పలుమార్లు చిత్రం వాయిదాపడింది. ఈసారి జూలై16న సినిమా రిలీజ్ అనుకున్నారు. కానీ ఈసారి కూడ దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభించడంతో థియేటర్లు మూతబడ్డాయి. ఎప్పుడు తెరుచుకుంటాయి అనేది క్లారిటీ లేదు.

ఇప్పటికైతే సినిమా హాళ్ల ఓపెనింగ్ మీద ఎలాంటి అప్డేట్ లేదు. దీంతో సినిమా వాయిదాపడుతుందనే వార్తలూ ఉన్నాయి. కానీ తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్లో విడుదల తేదీని కన్ఫర్మ్ చేశారు. జూలై 16న సెకండ్ ఛాప్టర్ కంటిన్యూ అవుతుందని క్లారిటీ ఇచ్చారు. దీంతో అభిమానుల్లో ఉన్న అపోహలు తొలగిపోయాయి. ఈ హెవీ యాక్షన్ ఎంటర్టైనర్ ను కన్నడతో పాటు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో చిత్రం విడుదలకానుంది. సినిమా కోసం అన్ని పరిశ్రమల నుండి స్టార్ నటీనటుల్ని తీసుకున్నారు. ఇందులో సంజయ్ దత్ ప్రధాన ప్రతినాయకుడిగా నటిస్తుండగా మరొక హిందీ నటి రవీనా టాండన్ ఒక పవర్ఫుల్ రోల్ చేస్తున్నారు. తెలుగు నుండి రావు రమేష్ ఇందులో ఒక కీలకమైన పాత్ర పోషించారు.

సంబంధిత సమాచారం :