వెనక్కి తగ్గని “RRR” టీం..అనుకున్న సమయానికే ఫిక్స్.!

Published on May 21, 2021 8:04 am IST

నిన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా తాను నటిస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ మల్టీస్టారర్ చిత్రం “రౌద్రం రణం రుధిరం” నుంచి కొమరం భీమ్ గా తారక్ సరికొత్త పోస్టర్ ను మేకర్స్ విడుదల చేసారు. అయితే ఈ పోస్టర్ రాకముందు అనేక రూమర్స్ వినిపించాయి.

ఈ చిత్రం అనుకున్న సమయానికి రాదని ఈ కొత్త పోస్టర్ తో సరికొత్త విడుదల తేదీని ప్రకటిస్తారని ఊహాగానాలు వినిపించాయి. అయితే అంతకు ముందు కోవిడ్ రెండో వేవ్ ఉధృతిగా ఉన్న సమయంలో మేకర్స్ ముందు ఫిక్స్ చేసిన అక్టోబర్ 13 రిలీజ్ డేట్ ను దాటవేసినా ఇప్పుడు భీమ్ పోస్టర్ లో మాత్రం అదే డేట్ ను పొందుపరిచారు.

సో ఈ చిత్రం టార్గెట్ అక్కడికే ఫిక్స్ అయ్యి ఉందని కన్ఫర్మ్ అయ్యింది. అన్నీ సెట్టయ్యి కుదిరితే మాత్రం ఈ భారీ ట్రీట్ ను మనం ఈ ఏడాదిలోనే విట్నెస్ చెయ్యొచ్చు.. ఇక వచ్చే ఏడాది లేదు.. వేసవి లేదు ఈ డేట్ తో ఓ సరైన క్లారిటీ రాజమౌళి ఇచ్చేసారు.

సంబంధిత సమాచారం :