‘భరత్ అనే నేను’కి అడ్డంకులు తొలగిపోతాయా ?


దక్షిణాది స్టార్ హీరోల్లో ఒకరైన మహేష్ బాబుకు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాట కూడ ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంటుంది. ఆయన గత చిత్రం ‘స్పైడర్’ తమిళ భాషలో కూడ రూపొంది నేరుగా విడుదలైంది. ఈ నైపథ్యంలో ఈ నెల 20న విడుదలకానున్న ఆయన తాజా చిత్రం ‘భరత్ అనే నేను’ మాత్రం తమిళనాట రిలీజవుతుందా లేదా అనే సంశయం నెలకొంది.

ఎందుకంటే కొన్నాళ్లుగా డిజిటల్ ప్రొవైడర్లకు వ్యతిరేకంగా తమిళ నిర్మాతల మండలి చేస్తున్న నిరసనకు తెలుగు నిర్మాతలు కూడ మద్దతు పలకడం వలన తమిళ సినిమాలతో పాటు తెలుగు సినిమాలు విడుదలలు కూడా ఆగిపోయాయి. పైగా ఈ బంద్ ఎప్పుడు ముగుస్తుందో ఖచ్చితంగా తెలియకపోవడంతో ఇప్పటి వరకు అక్కడ ‘భరత్ అనే నేను’ విడుదలపై ఎలాంటి నిర్ణయం జరగలేదట. మరి 20వ తేదీ లోపు బంద్ ముగిసి సినిమా విడుదలకు అడ్డంకులన్నీ తొలగిపోతాయో లేదో చూడాలి.