రాజశేఖర్ నటించే సినిమాలకు ముహూర్తం ఎప్పుడు ?
Published on May 31, 2018 1:01 am IST

సీనియర్ హీరో డా . రాజశేఖర్ చాల రోజుల తరువాత గత ఏడాది ‘గరుడ వేగ ‘సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు . ప్రవీణ్ సత్తారు తెరకేకించిన ఈ సినిమా సూపర్ హిట్ సాధించింది. నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా రాజశేఖర్ నటించి మెప్పించాడు . ఈ సినిమా తరువాత ఆయనకు మరిన్నిచిత్రాల్లో అవకాశం వస్తుందని అందరూ బావించారు . దానికి తగ్గటే మూడు సినిమాల్లో నటించనున్నాడని ఆ మధ్య సోషల్ మీడియా లో వార్తలు వచ్చాయి .

దానిలో ముందుగా రామ్ హీరోగా గరుడ వేగ దర్శకుడు ప్రవీణ్ సత్తార్ డైరెక్ట్ చేయబోయే సినిమాలో రాజ శేఖర్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారని వార్తలు వచ్చాయి. అయితే బడ్జెట్ కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది .దాని తరువాత ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న రామ్ చరణ్ , ఎన్టీఆర్ ల మల్టీ స్టారర్ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్నారని వార్తలు వచ్చాయి .దీనిపై అధికారికంగా రాజమౌళి గాని రాజశేఖర్ గానీ ఎవరు స్పందించలేదు .

ఈ సినిమాలు కాక నూతన దర్శకుడు తెరకెక్కిన్చే సినిమాలో నటించనున్నారని వార్తలు వచ్చాయి . ఈ సినిమా ఫై కూడా ఇంతవరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు. మరి రాజశేఖర్ గారు నటించే సినిమాలు ఎప్పుడు ప్రారంభం కానున్నాయో తెలుసుకోవాలనుంటే అధికారిక ప్రకటన వెలుబడే వరకు వేచి చూడాల్సిందే .

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook