కృష్ణ వంశీ కొత్త ప్రేమ కథ ఏమైందో ?

కృష్ణ వంశీ కొత్త ప్రేమ కథ ఏమైందో ?

Published on Aug 9, 2018 9:00 PM IST

krishna vamsi
టాలీవుడ్ లో క్రియేటివ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న డైరెక్టర్ ల్లో ‘కృష్ణ వంశీ’ పేరు ముందు వరసలో ఉంటుంది. అయితే ఏం లాభం. గత కొన్ని సంవత్సరాలుగా ఆయన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడుతున్నాయి. ఒకప్పుడు మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా తన హావా చూపించిన ఈ వినూత్న దర్శకుడికి ఇప్పుడు కొత్త వాళ్ళతో కొత్త ప్రేమకథలు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

ఏమైనా కుటుంబ చిత్రాలతో పాటు ప్రేమ కథా చిత్రాలు తియ్యడంలో కృష్ణ వంశీ’ శైలే వేరు. ఆర్టిస్ట్ ల నుంచి నటనను, మంచి కంటెంట్ ఉన్న స్క్రిప్ట్ లను అయన తీసుకున్నే విధానం కూడా అబ్బురపరుస్తోంది. ఈసారి అలాంటి సినిమాను తీసే ఆలోచనలోనే ఉన్నారు కృష్ణ వంశీ.

వివరాల్లోకి వెళ్తే ఆయన కొత్తవాళ్లతో ఓ కొత్త రకం ప్రేమకథను సినిమాగా తియ్యబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆ ప్రేమ కథకు సంబంధించిన స్క్రిప్ట్ ను పూర్తి చేశారట. సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ ప్రేమ కథతో మళ్ళీ కృష్ణ వంశీ ఫామ్ లోకి వస్తారని తెలుస్తోంది. అయితే ఈ సినిమాకి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.

తాజా వార్తలు