‘పెద్ది’ నైజాం బుకింగ్స్ పై కొనసాగుతున్న సస్పెన్స్.. అసలేం జరుగుతుంది..?

‘పెద్ది’ నైజాం బుకింగ్స్ పై కొనసాగుతున్న సస్పెన్స్.. అసలేం జరుగుతుంది..?

Published on Jun 2, 2026 11:07 PM IST

Peddii

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పెద్ది’ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కావడానికి కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ మరియు టికెట్ బుకింగ్స్ వ్యవహారాలు చాలా జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా నైజాం ఏరియాలో ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ రాబట్టేందుకు చిత్రబృందం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.

అయితే, తెలంగాణలో ఈ సినిమా టికెట్ ధరల పెంపు మరియు థియేటర్ల వారీగా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవ్వడంపై ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనికి సంబంధించిన అధికారిక జీవో మరియు బుకింగ్స్ అప్‌డేట్ ఇంకా వెలువడలేదు. జూన్ 3న ప్రీమియర్స్ ఉంటాయని మేకర్స్ చెప్పడంతో అభిమానులు బుకింగ్స్ ఎప్పుడెప్పుడు ఓపెన్ చేస్తారా అంటూ ఆశగా చూస్తు్న్నారు. కానీ, రేపు(జూన్ 3) ఉదయం 10:00 గంటల తర్వాతే ఈ చిత్రానికి సంబంధించిన జీవో వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రభుత్వ అనుమతులు లభించిన వెంటనే బుకింగ్స్ ఫుల్ స్వింగ్‌లో స్టార్ట్ కానున్నాయి.

బుచ్చిబాబు సానా దర్శకత్వంలో, వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. మరి నైజాం ఏరియాలో ఈ చిత్ర టికెట్ బుకింగ్స్ పై కొనసాగుతున్న సస్పెన్స్‌కు ఎప్పుడు తెరపడుతుందో వేచి చూడాలి.

తాజా వార్తలు