వాల్మీకి ప్రీ టీజర్‌లో నో డైలాగ్స్.. ఓన్లీ యాక్షన్

Published on Jun 24, 2019 4:29 pm IST

ఈ ఏడాది విడుదలకానున్న ఆసక్తికరమైన చిత్రాల్లో ‘వాల్మీకి’ కూడా ఒకటి. హరీష్ శంకర్ డైరెక్షన్లో వరుణ్ తేజ్ నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. తమిళ సూపర్ హిట్ చిత్రం ‘జిగర్తాండ’కు ఇది తెలుగు రీమేక్‌ కావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. వరుణ్ తేజ్ గ్యాంగ్ స్టర్ లుక్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. ఇకపోతే ఈరోజు సాయంత్రం 5 గంటల 18 నిమిషాలకు ప్రీ టీజర్ విడుదలకానుంది.

ఇందులో ఎలాంటి డైలాగ్స్ ఉండవట. ఓన్లీ యాక్షన్ మాత్రమేనట. అది కూడా వరుణ్ తేజ్ పాత్ర యొక్క పరిచయం మీదే ఉంటాయట. ఈ టీజర్ నిడివి 18 సెకన్లు ఉంటుంది. సెప్టెంబర్ 6వ తేదీన విడుదలకానున్న ఈ ఆత్రవ మురళి, పూజా హెగ్డేలు కీలక పాత్రలు చేస్తున్నారు. 14 రీల్స్ సంస్థపై రామ్ ఆచంట, గోపి ఆచంటలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :

X
More