ఆ హీరో చిత్రంలో నో హీరోయిన్, నో సాంగ్స్ అట.

Published on Sep 12, 2019 8:41 pm IST

హీరో కార్తీ చేస్తున్న ప్రయోగాత్మక చిత్రం ఖైదీ. దర్శకుడు లోకేష్ కనకరాజ్ విభిన్నంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం పూర్తిగా రాత్రి నేపథ్యంలో నడుస్తుంది. ఖైదీ అయిన కార్తీ ని ఒక పోలీస్ గ్రూప్ అలాగే ఒక రౌడీ గ్రూప్ వెంబడిస్తూ ఉంటుంది. వారి నుండి ఖైదీ కార్తీ ఎలా తప్పించుకున్నాడు అన్నదే ప్రధాన కథాంశంగా ఈ చిత్రం తెరకెక్కుతోందని సమాచారం.

కాగా ఈ చిత్రంలో అసలు పాటలే ఉండవట. అలాగే కార్తీ సరసన హీరోయిన్ కూడా ఉందట. ఈ విషయాన్నీదర్శకుడు లోకేష్ కనకరాజ్ స్వయంగా వెల్లడించారు. కమర్షియల్ అంశాలు లేకుండా పక్కా ప్రయోగాత్మక చిత్రంగా ఖైదీ మూవీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం దీపావళి కానుకగా విడుదల కానుంది. డ్రీం వారియర్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంగీతం శ్యామ్ సి ఎస్ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More