పవన్ సినిమాకు హంగామానే లేదు.!

Published on Mar 10, 2021 1:58 pm IST

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాల్లో మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ఏదన్నా ఉంది అంటే అది క్రిష్ జాగర్లమూడి తో చేస్తున్న భారీ బడ్జెట్ పీరియాడిక్ చిత్రం కూడా ఒకటి. అయితే ఎంత మోస్ట్ అవియేటెడ్ సినిమా అయినప్పటికీ సరైన అప్డేట్స్ లేకపోతే ఖచ్చితంగా ఆ హైప్ పక్క దారి పడుతుంది.

పవన్ గత చిత్రం “వకీల్ సాబ్”కు అయినా పర్వాలేదు లేదు కానీ రేపే ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు టైటిల్ తో పాటుగా గ్లింప్స్ టీజర్ ను విడుదలకు ప్లాన్ చేసిన పవన్ 27వ సినిమా మేకర్స్ నుంచి ఇంకా ఎలాంటి అలెర్ట్ పోస్టులు కానీ అప్డేట్స్ కానీ రాకపోవడం గమనార్హం. దీనితో ఫ్యాన్స్ లో కూడా కన్ఫ్యూజన్ నెలకొంది. మరి ఇప్పుడు ఎంత స్టార్ హీరో అయినా కూడా సరైన ప్రమోషన్స్ లేనిదే ఆఫ్ లైన్ ప్రేక్షకులకు రీచ్ లేని పరిస్థితి.

మరి ఇక నుంచి అయినా పవన్ సినిమా విషయంలో అప్ టు డేట్ అప్డేట్స్ ఉంటాయో లేదో చూడాలి. ఇక ఈ భారీ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ స్టార్ జాక్వలిన్ ఫెర్నాండేజ్ కీలక పాత్రలో నటిస్తుంది. అలాగే ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఏ ఎం రత్నం నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :