
టాలీవుడ్ కామెడీ కింగ్ అల్లరి నరేష్ నటించిన లేటెస్ట్ మొవుఎ జేమ్స్ బాండ్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి తెలుగు ప్రేక్షకులను మెప్పించి హిట్ గా మారింది. సుడిగాడు సినిమా తర్వాత అల్లరి నరేష్ కి ఆ రేంజ్ ఓపెనింగ్స్ తెచ్చి పెట్టిన సినిమా ఇదే కావడం విశేషం. చెప్పాలంటే అల్లరి నరేష్ గత కొన్ని సినిమాలలో రొటీన్ కి భిన్నంగా ప్రయోగాత్మక సినిమాలను ట్రై చేసాడు. కానీ ఇకపై అలాంటి సినిమాలు చెయ్యకూడదని నరేష్ డిసైడ్ అయ్యాడు. రీసెంట్ గా అల్లరి నరేష్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ‘నా గత సినిమాల్లో కొన్ని ప్రయోగాత్మక సినిమాలు, అవేవీ బాక్స్ ఆఫీసు వద్ద బాగా ఆడలేదు. నా కంఫర్ట్ జోన్ నుంచి బయటకి వచ్చి క్లాస్ ఆడియన్స్ కోసం చేసిన సినిమాలు వర్కౌట్ అవ్వలేదు. అలాగే కొన్ని సినిమాలు సరైన పబ్లిసిటీ లేకపోవడం వలన కూడా ఫెయిల్ అయ్యాయని’ తెలిపాడు.
అందుకోసమే అల్లరి నరేష్ జేమ్స్ బాండ్ పబ్లిసిటీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఒక వారం నుండు నుంచే అన్ని చోట్లా సినిమాని ప్రమోట్ చేసాడు, రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న తర్వాత విజయయాత్ర కూడా చేసాడు. అలాగే తన తోటి యంగ్ హీరోస్ అయిన నాని, సందీప్ కిషన్, సునీల్ లతో స్పెషల్ ఇంటర్వ్యూస్ కూడా చేసాడు. ఇక నుంచి ప్రయోగాలకి దూరంగా ఉండడమే కాకుండా జేమ్స్ బాండ్ ఇచ్చిన సక్సెస్ తనపై మరింత బాధ్యతని పెంచిందని, ఇకపై తన స్టైల్లోనే సినిమాలు చేస్తానని తెలిపాడు.

