కథను అంచనా వేయడంలో చిరంజీవి కంటే బెస్ట్ ఎవరూలేరు – రాజమౌళి !

కథను అంచనా వేయడంలో చిరంజీవి కంటే బెస్ట్ ఎవరూలేరు – రాజమౌళి !

Published on Jun 24, 2018 11:31 PM IST

Rajamouli
మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా నటించిన మొదటి చిత్రం ‘విజేత’. ఈ చిత్ర ఆడియో వేడుక కొద్దిసేపటి క్రితం హైదరాబాద్లోని జే.ఆర్.సి కన్వెన్షన్ సెంటర్లో ఘనంగా జరిగింది . మెగాస్టార్ చిరంజీవి ఈ వేడుకకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

ఇక ఈ వేడుకకు గెస్ట్ గా వచ్చిన అగ్ర దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ ఇండీస్ట్రీ లో కథను అంచనా వేయగల స్కిల్స్ ఒక్క చిరంజీవి గారికి మాత్రమే వున్నాయి నేను రామ్ చరణ్ తో చేసిన మగధీర చిత్ర కథ కూడా ముందు ఆయనే విన్నారు విన్న వెంటనే ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అవుతుంది అన్నారు . ఇప్పుడు ఈ చిత్ర కథను కూడా ఆయన విన్నాకనే పట్టాలెక్కింది కాబట్టి ఈ చిత్ర విజయం ఫై అనుమానం అవసరం లేదు తప్పకుండ ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందని హీరో కళ్యాణ్ దేవ్ ఈ విజయంతో ఇండస్ట్రీ లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇస్తాడని ఈ సందర్బంగా అయన అన్నారు .

సంబంధిత సమాచారం

తాజా వార్తలు