ఇండస్ట్రీలో టాలెంట్‌ను ఎవ్వరూ అణచివేయలేరు : సురేష్ బాబు

ఇండస్ట్రీలో టాలెంట్‌ను ఎవ్వరూ అణచివేయలేరు : సురేష్ బాబు

Published on Nov 18, 2015 1:03 AM IST

Suresh-babu

ప్రముఖ సినీ నిర్మాత రామానాయుడు వారసత్వాన్ని అందిపుచ్చుకొని పలు విజయవంతమైన చిత్రాలని నిర్మించి టాప్ ప్రొడ్యూసర్స్‍లో ఒకరుగా పేరు తెచ్చుకున్న నిర్మాత సురేష్ బాబు. ప్రస్తుతం తెలుగులో టాప్ ప్రొడ్యూసర్స్‍లో ఒకరుగా కొనసాగుతూ వస్తోన్న ఆయన, ఈ ఉదయం సినీ నిర్మాత రామ్మోహన్ దర్శకుడిగా మారి రూపొందించిన ‘తను నేను’ సినిమాకు సంబంధించిన మీడియా సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై సినిమా మంచి విజయం సాధించాలని కాంక్షించారు.

ఇక ఈ సందర్భంగానే మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో పైకి రానివ్వకపోవడం, అణిచివేయడం లాంటివి అస్సలుండవు. ప్రతిభ ఉంటే ఎవ్వరైనా సినీ పరిశ్రమలో నిలదొక్కుకోవచ్చు. నిర్మాత రామ్మోహన్ అదే పంథాలో నాని, రాజ్ తరుణ్ లాంటి టాలెంటెడ్ హీరోలను తెలుగు పరిశ్రమకు అందించారని తెలిపారు. ఇక కష్టపడితే ఇండస్ట్రీలో ఎవ్వరూ ఎవ్వరినీ ఆపలేరని, ప్రతిభతో మనమేంటో నిరూపించుకోవడమే కొత్తతరం లక్ష్యంగా చేసుకోవాలని సురేష్ బాబు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డరు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు