ఇంటర్వ్యూ : మురుగదాస్ – మహేష్ బాబులా ఇండియాలో మరే హీరో చేయలేడు !

ఇంటర్వ్యూ : మురుగదాస్ – మహేష్ బాబులా ఇండియాలో మరే హీరో చేయలేడు !

Published on Aug 22, 2017 2:03 PM IST


తెలుగు ప్రేక్షకులు ఎంతో కాలం నుండి ఎదురుచూస్తున్న సినిమాల్లో మహేష్ బాబు ‘స్పైడర్’ కూడా ఒకటి. ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ కానున్న సందర్బంగా టీమ్ ప్రమోషనల్ కార్యక్రమాల్ని ప్రారంభించింది. అందులో భాగంగా ఈరోజు దర్శకుడు మురుగదాస్ మీడియాతో మాట్లాడారు. ఆ సంగతులు మీకోసం..

ప్ర) మహేష్ బాబుతో మీ పరిచయం గురించి చెప్పండి ?

జ)చిరంజీవిగారితో ‘స్టాలిన్’ సినిమా చేసేప్పుడు రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు మహేష్ ను నాకు పరిచయం చేశారు. ఆ తర్వాత ఆయన చేసిన ‘అతడు’ చూశాను. అందులో మహేష్ ఆల్ రౌండ్ పెర్ఫార్మెన్స్ చూసి ఆయనతో సినిమా చేయాలని నిర్ణయించుకున్నా. మహేష్ కు కూడా ఆ సంగతి చెప్పాను. కానీ ఇద్దరం బిజీగా ఉండటం వలన సినిమా చేయడానికి 10 ఏళ్ళు పట్టింది.

ప్ర) ఈ ‘స్పైడర్’ సినిమాలో మహేష్ నే తీసుకోవాలని ఎందుకనిపించింది ?
జ) ఒక స్పై థ్రిల్లర్ తీయాలని అనుకున్నప్పుడు మొదటగా గుర్తొచ్చిన వ్యక్తి మహేష్ బాబు. ఆ పాత్రకి తగిన మాస్ ఫాలోయింగ్, లుక్స్ అతనిలో ఉన్నాయి. అలాగే రెండు భాషల్లో తీయాలనుకున్నప్పుడు తెలుగు, తమిళం బాగా మాట్లాడేవారే కావాలని. అప్పుడు మహేష్ ఒక్కడే చాయిస్. అతను కూడా ఒప్పుకోవడంతో సినిమా మొదలైంది.

ప్ర) సినిమా పూర్తికావడనికి ఇంత సమయం ఎందుకు పట్టింది ?
జ) రెండు భాషల్లో సినిమా తీయడం సులభం కాదు. తెలుగు, తమిళ్ రెండిటికీ షాట్స్ వేరు వేరుగా తీయాలి. అంతేగాక యాక్షన్ సినిమా కాబట్టి విజువల్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. అందుకే ఎక్కువ సమయం తీసుకుని పలు దేశాల్లో విజువల్ ఎఫెక్ట్స్ పనులు చేశాం. ప్రస్తుతం ఒక్క పాట మాత్రమే మిగిలుంది.

ప్ర) రకుల్ ప్రీత్ ని ఎలా సెలెక్ట్ చేసుకున్నారు ?
జ) ముందు ఎవరైనా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ను తీసుకోవాలని అనుకున్నాం. కానీ సినిమా తీసేది తెలుగు, తమిళంలో కాబట్టి ఇక్కడి వారికి బాగా తెలిసిన నటి అయితే బాగుంటుందని ఆలోచించి చివరి నిమిషంలో రకుల్ ప్రీత్ సింగ్ ను తీసుకున్నాం.

ప్ర) మహేష్ బాబుతో వర్క్ ఎలా ఉంది ?
జ) మహేష్ డెడికేషన్ చూసి ఆశ్చర్యపోయాను. 80 రోజులపాటు రాత్రి పూట షూట్ చేశాం. ఒక్కరోజు కూడా కంప్లైంట్ చేయలేదు. ప్రతిరోజూ సెట్ కు టైమ్ కు వచ్చేవాడు. అతను దర్శకుల హీరో. వాళ్లకు ఏం కావాలో అది ఇస్తారు. అతను చేసినట్టు స్పైడర్ లో పాత్రను ఇండియాలో మరో నటుడు చేయలేడు. నేను కూడా ఆయనకు అభిమానిని అయిపోయా.

ప్ర) ఈ సినిమాలో ‘స్పైడర్’ ఏం చేస్తుంది ?
జ) అందరూ ఇదొక డివైస్ ఓరియెంటెడ్ స్పై థ్రిల్లర్ అనుకుంటున్నారు. కానీ ఇందులో చాలా ఎమోషనల్, సోషల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇండియా యొక్క ఇంటెలియజెన్స్ ఏజెన్సీ ద్వారా ఆ అంశాలను ఆసక్తికరంగా చెప్పడం జరిగింది.

ప్ర) తెలుగు, తమిళంలకు మార్పులేమైనా చేశారా ?
జ) లేదు. కథ మొత్తం హైదరాబాద్ బ్యాక్ డ్రాప్లో నడుస్తుంది. తమిళంలో కూడా అంతే. నేను లాస్ట్ మినిస్ట్ లో కొన్ని మార్పులు చేశాను. టీమ్ తో కూర్చుని బాగా చర్చించిన తర్వాతే ఆ మార్పులు చేశాను.

ప్ర) సినిమాను హిందీలో ఎందుకు చేయడం లేదు ?
జ) స్క్రిప్ట్ రాసేప్పుడే తెలుగు, తమిళంలో చేయాలనే అనుకున్నాను. ఇప్పుడు కూడా సినిమా ఇండియా లెవెల్లో ఉంటుంది. పైగా రెండు భాషల్లో చేయడమే కష్టమైన పని.

ప్ర) తమిళంలో మహేష్ పాపులారిటీ గురించి చెప్పండి ?
జ) గత కొన్నిరోజులుగా మహేష్ కు తమిళంలో మంచి ఫాలోయింగ్ ఉంది. లాంచ్ ఈవెంట్ తర్వాత ఇంకా పాపులర్ అవుతాడు. తమిళ డబ్బింగ్ కూడా చాలా బాగా చెప్పాడు. ఈ సినిమా తరవాత మహేష్ అక్కడ ఇంకా పెద్ద స్టార్ అవుతాడు.

ప్ర) మీ తర్వాతి ప్రాజెక్ట్స్ ఏంటి ?
జ) నా దగగ్ర కొన్ని స్క్రిప్ట్స్ ఉన్నాయి. రజనీగారికి కూడా కథ చెప్పాను. ఆయనకు బాగా నచ్చింది. ప్రస్తుతం 3, 4 నెలలు రెస్ట్ తీసుకొని ఆ తర్వాత నెక్స్ట్ సినిమా మీద వర్క్ చెస్తాను. ఖచ్చితంగా తమిళ ప్రాజెక్టే చేస్తాను .

సంబంధిత సమాచారం

తాజా వార్తలు