కర్ణాటకలో కాలా షో పడలేదు !
Published on Jun 7, 2018 12:00 pm IST

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కాలా చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలై థియేటర్ల వద్ద అభిమానులు పండగ చేసుకుంటుంటే కర్ణాటకలో మాత్రం ఈ సినిమా ఒక్క షో కూడా పడలేదు. ఇటీవల రజినీకాంత్ కావేరి నది జలాల ఫై చేసిన వాఖ్యలతో మనస్థాపం చెందిన కన్నడిగులు ఈ చిత్రం అక్కడ రిలీజ్ చేయకుండా ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఒకే ఒక్క థియేటర్లో షో స్టార్ట్ అయినా కొద్దిసేపటి ఆ షోను రద్దు చేశారు థియేటర్ యాజమాన్యం . టికెట్ కొనుకున్న ప్రేక్షకులకు తిరిగి డబ్బుని చెల్లించింది. చేసేదేంలేక పాపం సినిమా చూడడానికి వచ్చిన ప్రేక్షకులు నిరాశతో వెనుదిరిగారు .

కావేరి నది జలాల విషయంలో సుప్రీం కోర్టు ఏంచెప్పిందో నేను అదే చెప్పానని ఇందులో నా తప్పు ఏమి లేదని దయచేసి కాలా సినిమా విడుదలను అడ్డుకోకండి అని రజినీకాంత్ కన్నడిగులను వేడుకున్న వారు కరుణించలేదు. మరి కర్ణాటకలో ప్రస్తుత పరిస్థితి చుస్తే ఈ సినిమా విడుదల కష్టంగానే కనిపిస్తుంది.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook