ఇకపై ఎన్టీఆర్ కి విరామం లేదట..!

Published on Mar 1, 2020 10:18 am IST

రాజమౌళి పాన్ ఇండియా మూవీ కోసం రెండేళ్లు వెండి తెరకు దూరమైన ఎన్టీఆర్ ఆ గ్యాప్ ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. అందుకే ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ కూడా పూర్తి కాకుండానే త్రివిక్రమ్ తో మూవీ ఫైనల్ చేశాడు. ఎన్టీఆర్ 30వ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న త్రివిక్రమ్ మే నుండి ఈ చిత్ర షూటింగ్ మొదలుపెట్టనున్నాడు. దీనితో ఎన్టీఆర్ అటు ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ మరియు డబ్బింగ్ కార్యక్రమాలలో పాల్గొంటూనే త్రివిక్రమ్ షూటింగ్ లో జాయిన్ కావాల్సిన పరిస్థితి. కాబట్టి ఎన్టీఆర్ కి వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్ వరకు విరామం ఉండదు.

ఆర్ ఆర్ ఆర్ నిజానికి ఈ ఏడాది జులై 30న విడుదల కావాల్సివుండగా, జనవరి 8, 2021కి వాయిదావేశారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీమ్ రోల్ చేస్తుండగా, మరో హీరో చరణ్ అల్లూరి పాత్ర చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ 30వ చిత్ర షూటింగ్ మే నుండి సెట్స్ పైకి వెళ్లనుంది. త్రివిక్రమ్ ప్రస్తుతం ఈ చిత్ర ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నాడు.

సంబంధిత సమాచారం :

More