“వకీల్ సాబ్” ట్రైలర్ సెన్సేషన్..రికార్డుల మోత.!

Published on Mar 30, 2021 8:02 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శృతి హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం “వకీల్ సాబ్” నుంచి మోస్ట్ అవైటెడ్ ట్రైలర్ ను మేకర్స్ నిన్ననే విడుదల చేసిన సంగతి తెలిసిందే. శ్రీరామ్ వేణు తెరకెక్కించిన ఈ చిత్రం తాలూకా ట్రైలర్ నెవర్ బిఫోర్ రెస్పాన్స్ ను తెచ్చుకుంది. విడుదల కాబడిన మొదటి సెకండ్ నుంచీ భారీ రెస్పాన్స్ ను కొల్లగొట్టిన ఈ ట్రైలర్ చాలా ఏళ్లకు మళ్ళీ తెలుగు సినిమాల ట్రైలర్స్ కు పూర్వ వైభవాన్ని తెచ్చిపెట్టింది.

అయితే ఇదిలా ఉండగా బాలీవుడ్ హిట్ చిత్రం పింక్ కు రీమేక్ గా పవన్ మార్క్ లో తెరకెక్కించారు. పవన్ పై పెద్దగా ఎలివేషన్స్ లేకుండా పూర్తిగా కంటెంట్ మీదనే కట్ చేసిన ఈ ట్రైలర్ కే నాలుగేళ్లుగా చెక్కు చెదరని “బాహుబలి 2” రికార్డ్స్ బద్దలయ్యాయి. రియల్ టైం వ్యూస్ లో ఎప్పుడో 12 మిలియన్ వ్యూస్ లాక్ చేసిన ఈ ట్రైలర్ ఇప్పుడు నెవర్ బిఫోర్ 8 లక్షల లైకులు మార్క్ ను క్రాస్ చేసి 24 గంటల్లో సాలిడ్ ఫిగర్ దగ్గర ఆగేందుకు సిద్ధంగా ఉంది.

మరి 1 మిలియన్ లైక్స్ ను అందుకుంటుందో లేదో కానీ ఆ అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయని తెలుస్తుంది. మొత్తానికి మాత్రం పవన్ కం బ్యాక్ ఈ రేంజ్ లో ఉంటుంది అని ఎవరూ ఊహించి ఉండరని చెప్పాలి. ఇక ఈ చిత్రంలో నివేతా థామస్, అంజలి మరియు అనన్య నాగళ్ళలు కీలక పాత్రల్లో నటించగా ప్రకాష్ రాజ్ మరో లాయర్ గా కనిపిస్తున్నారు. థమన్ సంగీతం అందించిన ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాణం వహించగా ఈ చిత్రాన్ని మేకర్స్ వచ్చే ఏప్రిల్ 9న భారీ స్థాయిలో విడుదల చెయ్యనున్నారు.

సంబంధిత సమాచారం :