‘నేల టికెట్టు’ గురించి వచ్చిన వార్తలన్నీ అవాస్తవాలేనట !

‘నేల టికెట్టు’ గురించి వచ్చిన వార్తలన్నీ అవాస్తవాలేనట !

Published on May 1, 2018 5:36 PM IST

రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘నేల టికెట్టు’ ఆడియో వేడుక గురించి ఈరోజు మధ్యాహ్నం వచ్చిన వారల్లో ఎలాంటి వాస్తవం లేదని తేలింది. ఈ చిత్ర ఆడియో కార్యక్రమం మే 12న జరగుతుందని, ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా వస్తారని సోషల్ మీడియాలో బయలుదేరిన వార్తల్ని నిర్మాణ సంస్థ ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్ ఖండించింది.

ఈ వార్తల్ని నమ్మొద్దని, త్వరలోనే ఆడియో తేదీని, చీఫ్ గెస్ట్ వివరాల్ని అధికారికంగా వెల్లడిస్తామని తెలియజేసింది. అలాగే దర్శకుడు కళ్యాణ్ కృష్ణ సైతం ఈ వార్తల్లో నిజం లేదని, త్వరలోనే అసలైన వివరాల్ని ప్రకటిస్తామని అన్నారు. ఇకపోతే రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో రవితేజకు జోడీగా మాళవిక శర్మ నటిస్తోంది.

తాజా వార్తలు