పవన్ పై రూమర్స్ లో ఎలాంటి నిజం లేదా?

పవన్ పై రూమర్స్ లో ఎలాంటి నిజం లేదా?

Published on Dec 16, 2022 9:03 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇప్పుడు పలు సినిమాలు చేయనున్న సంగతి తెలిసిందే. మరి వీటిలో అయితే పవన్ ఆల్రెడీ దర్శకుడు “హరిహర వీరమల్లు” అనే భారీ చిత్రాన్ని దర్శకుడు క్రిష్ జాగర్లమూడితో చేస్తున్న సంగతి తెలిసిందే. మరి దీనితో అయితే ఈ భారీ సినిమాపై అనేక అంచనాలు నెలకొన్నాయి.

ఇక మరోపక్క అయితే సినిమాతో పాటుగా పవన్ రాజకీయాల్లో కూడా మంచి బిజీగా ఉండగా లేటెస్ట్ గా పవన్ తైల స్టార్ హీరో విజయ్ నటిస్తున్న చిత్రం “వారసుడు” ప్రీ రిలీజ్ కోసం రాబోతున్నాడు అనే కొన్ని రూమర్స్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి. మరి తమిళ మీడియా మొదట ఈ టాక్ స్టార్ట్ కాగా ఇప్పుడు దీనిపై క్లారిటీ తెలుస్తుంది.

పవన్ విజయ్ ఫంక్షన్ వస్తున్నాడు అనే వార్తల్లో అయితే ఎలాంటి నిజం లేదట. ఇవన్నీ జస్ట్ రూమర్స్ మాత్రమే అని పవన్ రావట్లేదని టాలీవుడ్ వర్గాల నుంచి లేటెస్ట్ అప్డేట్. మరి ప్రస్తుతానికి ఇది అవాస్తవం కావచ్చు కానీ లాస్ట్ మినిట్ లో ఏమన్నా అవ్వొచ్చు..

సంబంధిత సమాచారం

తాజా వార్తలు