‘RRR 2’ ఆ రూమర్స్ లో నిజం లేదా?

‘RRR 2’ ఆ రూమర్స్ లో నిజం లేదా?

Published on May 9, 2025 11:59 PM IST

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అలాగే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ లతో దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన గ్లోబల్ సెన్సేషన్ చిత్రం “రౌద్రం రణం రుధిరం” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రానికి మేకర్స్ సీక్వెల్ కూడా ఉంటుంది అని టాక్ వచ్చింది. మేకర్స్ కూడా దీనిపై హింట్స్ ఇవ్వగా లేటెస్ట్ గా ఓ టాక్ వైరల్ గా మారింది.

ఇపుడు రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేస్తున్న సినిమా తర్వాతే RRR ఉంటుంది అంటూ టాక్ సోషల్ మీడియాలో స్టార్ట్ అయ్యింది. కానీ ఈ రూమర్స్ లో ప్రస్తుతం ఎలాంటి నిజం లేదు అని తెలుస్తుంది. అవి కేవలం స్పెక్యులేషన్స్ మాత్రమే కాగా ఎలాంటి క్లారిటీ లేదు. సో ప్రస్తుతానికి అవన్నీ గాలి వార్తలే అని చెప్పొచ్చు. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ పెద్ది సినిమాలో ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాతో బిజీగా ఉన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు