విజయ్ బర్త్ డే రోజున కూడా కానరాని ‘జన నాయగన్’..!

విజయ్ బర్త్ డే రోజున కూడా కానరాని ‘జన నాయగన్’..!

Published on Jun 22, 2026 8:32 PM IST

Jana-nayagan

తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూసిన ‘జన నాయగన్’ సినిమా అప్‌డేట్ రాకపోవడంతో నిరాశే ఎదురైంది. కనీసం బర్త్‌డే ట్రీట్‌గా రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ లేదా ఒక కొత్త పోస్టర్ అయినా వస్తుందని ఆశించిన ఫ్యాన్స్‌కు ప్రొడక్షన్ హౌస్ నుండి పూర్తి సైలెన్స్ మిగిలింది.

నిజానికి ఎన్నికల తర్వాత కూడా విజయ్ ఈ చిత్ర నిర్మాతలతో సన్నిహితంగానే ఉంటున్నాడు. అయితే, ప్రజలు తనను ఒక సీరియస్, పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా మాత్రమే చూడాలని ఆయన భావిస్తున్నాడు. అందుకే సీఎం అయినప్పటి నుండి తన రాజకీయ పరిపాలనలోకి ఎక్కడా సినిమా చర్చలు రాకుండా విజయ్ పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

ఈ కారణాల వల్లే ‘జన నాయగన్’ చిత్రానికి సంబంధించిన ఎలాంటి సినిమా ఈవెంట్స్ లేదా ప్రమోషన్స్ జరగడం లేదు. ఈ మోస్ట్ అవేటెడ్ మూవీ ఖచ్చితంగా థియేటర్లలోకి వస్తుందనడంలో సందేహం లేనప్పటికీ.. ఇది వెండితెరపై విడుదల కావడానికి మరికొంత సమయం పట్టేలా కనిపిస్తోంది.

తాజా వార్తలు