ఈ హీరోయిన్ని ఎవరూ పట్టించుకోవట్లేదు !

Published on Apr 10, 2019 11:00 pm IST

మొత్తానికి నాగ చైతన్య – సమంత మళ్లీ చాలా సంవత్సరాల తరువాత కలిసి శివ నిర్వాణ దర్శకత్వంలో నటించిన ‘మజిలీ’ చిత్రం మొదటి షో నుంచి మంచి పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద భారీగానే వసూళ్లు సాధిస్తోంది. దానికి తోడు సినిమాలో ప్రతి నటి, నటుడు చాలా బాగా నటించారు. అలాగే నాగ చైతన్య, సమంత తమ పాత్రలకు ప్రాణం పోశారు.

ఇక సినిమాలో క్రికెటర్ గా అలాగే ఏ పని చెయ్యని భర్తగా నటించిన చైతు చక్కని నటనను కనబరిచగా.. సమంత ఎప్పటిలాగానే చాలా బాగా చేసింది. అదే విధంగా ఈ సినిమాలో సెకెండ్ హీరోయిన్ గా నటించిన దివ్యంశ కౌశిక్ కూడా తన పాత్రలో అద్భుతంగా నటించింది.

ముఖ్యంగా నార్త్ ఇండియన్ అమ్మాయిగా తన స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటుగా తన నటనతోనూ ఆకట్టుకుంది. కానీ మజిలీలో హీరోయిన్ గా క్రెడిట్ మొత్తం సమంతకే వెళ్ళిపోయింది. దివ్యంశ కౌశిక్ కూడా తనకు రావాల్సిన గుర్తింపు రాలేదని ఫీల్ అవుతుందట. అందుకు తగ్గట్లుగానే అందరూ సామ్ – చైతు గురించే మాట్లాడుతున్నారు గాని, ఈ హీరోయిన్ని ఎవరూ పట్టించుకోవట్లేదు.

సంబంధిత సమాచారం :