Avatar 1: వైరలవుతున్న రేర్ ఫుటేజ్ వీడియో చూసారా?

Avatar 1: వైరలవుతున్న రేర్ ఫుటేజ్ వీడియో చూసారా?

Published on Dec 24, 2025 10:02 PM IST

avatar

ప్రపంచ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్ అయ్యిన చిత్రాల్లో దర్శకుడు జేమ్స్ కేమెరూన్ నుంచి వచ్చిన సినిమాలే ఇప్పటికీ ఉంటాయి. ఎన్నో ఏళ్ళు కితం రిలీజ్ అయ్యిన సినిమాలే రికార్డు లాంగ్ రన్ తో ఊహించని నంబర్స్ సెట్ చేసి వదిలేశాయి. అయితే ఈ సినిమాల రికార్డులు మళ్ళీ తానే దగ్గదగ్గరగా అందుకుంటున్నారు.

మరి ఇలా ఎప్పుడో తన నుంచి వచ్చిన 2009లో వచ్చిన అవతార్ పార్ట్ 1 ఇప్పటికీ హాలీవుడ్ లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా నెంబర్ 1 గ్రాసర్ గా ఉంది. దీని తర్వాత వచ్చిన రెండు సినిమాలు కూడా దీన్ని రీచ్ అవ్వడం అనేది కష్టంగానే మారింది. ఇలా అవతార్ పార్ట్ 1 కి మాత్రం ఆ ఎక్స్ పీరియెన్స్ ని మళ్ళీ ఫ్యాన్స్ నెమరు వేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా అసలు అవతార్ 1 పై ఒక రేర్ వీడియో అంటూ సోషల్ మీడియాలో ఒకటి చక్కర్లు కొడుతోంది.

నిజానికి అవతార్ 1 సినిమా 2009లో వస్తే ఈ రేర్ వీడియో తాలూకా ఫుటేజ్ 2006 లోనిది అట. ఇందులో అవతార్ 1 లోని ఒక సీన్ కనిపిస్తుంది. హీరో హీరోయిన్ పాత్రలు పాండోరా గ్రహంలో మాట్లాడుకునే సన్నివేశం ఇది కాగా మనం సినిమాలో చూసిన నటులు కాకుండా ఇందులో మరో పాత్రలు యానిమేటడ్ గా కనిపిస్తున్నారు. దీనితో ఈ ఊహించని వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తాజా వార్తలు