డైరెక్షన్ వైపు వెళ్ళను – మహేష్ బాబు

డైరెక్షన్ వైపు వెళ్ళను – మహేష్ బాబు

Published on Jul 29, 2015 10:22 AM IST

Mahesh-srimantudu
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ‘శ్రీమంతుడు’ సినిమా మరో 8 రోజుల్లో, అనగా ఆగష్టు 7న తెలుగు, తమిళ ప్రేక్షకుల ముందు రానుంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా చివరి దశకు చేరుకున్న ఈ సినిమా ఫస్ట్ కాపీ రేపటి కల్లా సిద్దం కానుంది. జూలై 31న సినిమాని సెన్సార్ కి పంపనున్నారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించిన ఆసక్తికర విషయాలతో పాటు, తన ఫ్యూచర్ ప్లాన్స్ గురించి చెప్పారు. మహేష్ ఇన్ని రోజులు హీరోగా అందరినీ ఎంటర్టైన్ చేసారు కానీ శ్రీమంతుడు సినిమాతో సహా నిర్మాతగా కూడా ఎంటర్ అయ్యాడు.

హీరోగా, నిర్మాతగా మారారు డైరెక్టర్ గా కూడా మారే అవకాశం ఉందా అంటే ‘ అసలు డైరెక్షన్ చెయ్యాలని నేను ఎప్పుడు ఆలోచించలేదు, చెయ్యను కూడా. డైరెక్షన్ చెయ్యాలంటే స్పెషల్ స్కిల్స్ ఉండాలి. అది చాలా టఫ్ జాబ్. నేను యాక్టర్ గా చాలా హ్యాపీగా ఉన్నాను. ఇకపోతే నిర్మాతగా అంటారా నాకు ఇంకా అనుభవం కావాలి అందుకే నేను వేరే నిర్మాతలతో కలిసి సినిమాలు చేస్తాను. అనుభవం వచ్చాక నిర్మాతగా సినిమాలు చేస్తాను. ఎందుకంటే న్యూ టాలెంట్ ని కనుగొని వారిని పరిచయం చేయడం అనేది చాలా పెద్ద భాద్యత’ అని మహేష్ బాబు తెలిపాడు.

కొరటాల శివ డైరెక్ట్ చేసిన ఈ సినిమా సక్సెస్ పై మహేష్ బాబు సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించారు.

తాజా వార్తలు