నేలటికెట్ షూటింగ్ సమయంలో ఆ సంఘటన జరగలేదు !
Published on Feb 28, 2018 7:00 am IST

కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రవితేజ నటిస్తోన్న సినిమా షూటింగ్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఫ్యామిలి ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు నేలటికెట్ అనే టైటిల్ ఖరారు చేసారు. ఈ సినిమా శాటిలైట్ డిజిటల్‌ హిందీ డబ్బింగ్‌ రైట్స్‌ రూ.25కోట్లకు ఓ ప్రముఖ టెలివిజన్‌ ఛానల్ దక్కించుకోవడం విశేషం.

రవితేజ సరసన మాళవిక శర్మ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్ లో మాళవిక శర్మ గాయాలు పాలయ్యిందని ఒక వార్తా సోషల్ మీడియాలో హాల్చల్ చేస్తోంది. కాని చిత్ర వర్గాల సమాచారం మేరకు నెలటికెట్ షూటింగ్ సమయంలో అలాంటి సంఘటన జరగలేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్ర యూనిట్ భారి యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో బిజీగా ఉంది. హీరోయిన్ మాళవిక శర్మ షూటింగ్ లో పాల్గొనడం విశేషం. శక్తి కాంత్సంగీతం అందిస్తోన్న ఈ సినిమాకు చోటా కెప్రసాద్ ఎడిటర్.

 
Like us on Facebook