‘గీత గోవిందం’ సినిమాతో 100 కోట్ల క్లబ్ లో చేరిన సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ త్వరలోనే ‘నోటా’ చిత్రం తో ప్రేక్షకులముందుకు రానున్నాడు. పొలిటికల్ డ్రామా గా రానున్నఈ చిత్రం తో ఆయన తమిళ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఇరుముగన్ దర్శకుడు ఆనంద్ శంకర్ తెరకెక్కించిన ఈ చిత్రంలో మెహ్రీన్ జర్నలిస్ట్ పాత్రలో నటిచింది.
ఇక ఈ చిత్రాన్ని కేవలం 48 రోజుల్లోనే పూర్తి చేశారట. ఆ తరువాత పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం ఎక్కువ సమయాన్ని కేటాయించారట. ఈచిత్రం యొక్క తమిళ వెర్షన్ ఈ రోజు సెన్సార్ కు వెళ్ళింది. సెన్సార్ బోర్డు ఈచిత్రానికి ‘యు’ సర్టిఫికెట్ ఇచ్చింది. స్టూడియో గ్రీన్ పతాకం ఫై జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 5న తెలుగు , తమిళ భాషల్లో విడుదలకానుంది. ఇక ఇటీవల విజయ్ నటించిన ‘గీత గోవిందం’ తమిళనాడులో విడుదలై నాన్ బాహుబలి రికార్డ్స్ ను బద్దలు కొట్టింది. దాంతో ఈ నోటా చిత్రానికి అక్కడ మంచి బజ్ క్రియేట్ చేసింది.


