హరీష్ శంకర్‌ తో సినిమా ప్రకటించిన ప్రముఖ బ్యానర్ !

హరీష్ శంకర్‌ తో సినిమా ప్రకటించిన ప్రముఖ బ్యానర్ !

Published on May 18, 2020 10:20 PM IST

harish shankar

నిర్మాత బండ్ల గణేష్ తో సోషల్ మీడియా వేదికగా నడిచిన కోల్డ్ వార్ తో హరీష్ శంకర్‌ గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్నాడు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో హరీష్ ఒక సినిమా చేస్తున్నాడని, అది వచ్చే ఏడాది ప్రారంభమవుతుందని అందరికీ తెలిసిందే.

అయితే తాజాగా ప్రఖ్యాత బ్యానర్ 14 రీల్స్ ప్లస్ హరీష్‌ శంకర్ తో మరోసారి కలిసి పనిచేయబోతున్నామని ఈ రోజు ఒక అధికారిక ప్రకటన చేసింది. బండ్లతో వార్ తరువాత ఇలా ప్రకటించడం ఆసక్తికరమైన పరిణామమే. మరి ఈ సినిమా ఎలా ఉండబోతోంది ? ఈ సినిమాలో ఎవరు నటించబోతున్నారు అనే విషయాలు తెలియాల్సి ఉంది. గతంలో హరీష్ శంకర్ తో 14 రీల్స్ బ్యానర్ గద్దలకొండ గణేష్ సినిమా చేసింది.

ప్రస్తుతం హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కోసం స్క్రిప్ట్ రాస్తున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ కు సంబంధించిన ఫస్ట్ డ్రాఫ్ట్ ను పూర్తి చేసినట్లు.. లాక్ డౌన్ తరువాత పవన్ ను కలిసి స్క్రిప్ట్ చెప్పబోతున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు