
‘తని ఒరువన్’.. జయం రవి హీరోగా, 90వ దశకంలో తెలుగు, తమిళ సినిమాల్లో సంచలనంగా నిలిచిన అరవింద్ స్వామి విలన్‌గా రూపొందిన సినిమా. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం తమిళ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. ఒక సరికొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు తమిళనాట అద్భుతమైన రివ్యూలతో పాటు కలెక్షన్స్ వచ్చిపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు పలువురు పెద్ద నిర్మాతలు ప్రయత్నాలు చేశారు.
కాగా చివరకు ‘తని ఒరువన్’ తెలుగు రీమేక్ హక్కులను ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య సొంతం చేసుకున్నారు. భారీ మొత్తానికి ఆయన ఈ హక్కులను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ ఈ రీమేక్‌లో హీరోగా నటిస్తారని సమాచారం. ఇక ఇదే సినిమాను మహేష్ బాబు రీమేక్ చేయనున్నారనే వార్త కూడా వినిపించగా, చివరకు రామ్ చరణ్ ఈ సినిమాను చేసేందుకు సిద్ధమైపోయారని తెలుస్తోంది. ప్రస్తుతం రామ్ చరణ్‌తో బ్రూస్‌లీ సినిమాను నిర్మిస్తున్న దానయ్య, ఆ సినిమా తర్వాత వెంటనే మళ్ళీ రామ్ చరణ్‌తోనే తని ఒరువన్ సినిమాను ప్లాన్ చేయనున్నారట.

