సరికొత్త “ఏటిటి” యాప్ తో రిలీజ్ కానున్న స్పెషల్ సినిమా ”డర్టీ హరి”.!

Published on Nov 29, 2020 3:00 pm IST

ఈ ఏడాది ఒక్కసారిగా జరిగిన పెను మార్పులు ఏంటో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్ రంగంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. డిజిటల్ ప్రపంచం మరింత అభివృద్ధి చెందడంతో మన తెలుగులో కూడా మంచి కొత్త స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ కూడా వచ్చాయి. అలా ఇప్పుడు ఒక సరికొత్త యాప్ “ఏటిటి” ఒక స్పెషల్ సినిమా డిజిటల్ రిలీజ్ తో గ్రాండ్ గా విడుదల అవుతుంది. అయితే స్పెషల్ సినిమా అని ఎందుకు అనాల్సి వచ్చింది అంటే.

తెలుగులో ఎన్నో అద్భుతమైన చిత్రాలకు నిర్మాణం వహించి మంచి గుర్తింపు తెచ్చుకున్న సుమంత్ ఆర్ట్స్ నిర్మాణ సంస్థ అధినేత ప్రముఖ నిర్మాత ఎం ఎస్ రాజు ఆ చిత్రానికి దర్శకత్వం వహించడం విశేషం. ఎన్నో చిత్రాలకు నిర్మాణం వహించిన ఆయన “వాన”, తూనీగ తూనీగ” సినిమాలు దర్శకత్వం వహించి ఇప్పుడు “డర్టీ హరి” అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం తాలూకా టీజర్ కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ తో ట్రెండ్ లోకి కూడా వచ్చింది.

ఇపుడు ఈ చిత్రాన్ని ఈ సరికొత్త ఏటిటి స్ట్రీమింగ్ యాప్ వారు చూసి ఆ హక్కులను మంచి ధరకు కొనుగోలు చేసారు.అయితే ఈ స్ట్రీమింగ్ యాప్ ద్వారా పే పర్ వ్యూ అన్నట్టుగా ఛార్జ్ చెయ్యనున్నారు. వచ్చే డిసెంబర్ 18న గ్రాండ్ గా లాంచ్ కానున్న ఈ ఏటిటి యాప్ లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తుండగా ఈ యాప్ పై అధికారిక ప్రకటన వచ్చే డిసెంబర్ మొదటి వారంలో రానుంది. అలాగే ఈ యాప్ లో నుంచికాల్ చేసి సినిమాను చూసే విధంగా కూడా స్పెషల్ ప్లాన్స్ ను కూడా చేశారట. మరి ఇలాంటి స్పెషల్ యాప్ లో అలాంటి స్పెషల్ సినిమా “డర్టీ హరి” విడుదలకు ఈ డిసెంబర్ 18 వరకు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :

More