సతీష్ కుమార్ శ్రీరంగం దర్శకత్వం లో నాగార్జున సినీ క్రియేషన్స్ పతాకం పై నిర్మించన చిత్రం ‘4 ఇడియట్స్’. ఈ చిత్ర ఆడియో విడుదల వేడుక నేడు హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లో ఘనంగా జరిగింది. అగ్ర నిర్మాత సి.కళ్యాణ్ ముఖ్య అతిధిగా విచ్చేసి 4 ఇడియట్స్ ఆడియోను విడుదల చేసారు.
అనంతరం సి కళ్యాణ్ మాట్లాడుతూ “ఈ సినిమా లో అందరు కొత్తవాళ్లు నటించారు. దర్శక నిర్మాత సతీష్ కుమార్ శ్రీరంగం నాకు బాగా పరిచయం. చిన్న సినిమాలు విడుదల చాల కష్టం, వారానికి 6 సినిమాలు విడుదలవుతున్నాయి కానీ జనం థియేటర్ కి రావటం లేదు. చాల బాధగా ఉంది. కానీ నిర్మాత సతీష్ కి డిస్ట్రిబ్యూషన్ మీద మంచి పట్టు ఉంది. అతనికి చాల అనుభవం ఉంది. ఖచ్చితంగా ఈ సినిమా విడులవుతుంది. ఈ 4 ఇడియట్స్ విడుదలై మంచి విజయం సాధించాలని కోరుకుంటున్న” అని అన్నారు.
దర్శక నిర్మాత సతీష్ కుమార్ శ్రీరంగం మాట్లాడుతూ ‘సి కళ్యాణ్ గారు చాలా బిజీ గా ఉన్న నా సినిమా ఆడియో విడుదల చేయటానికి విచ్చేసినందుకు ఆయనకు నా కృతఙ్ఞతలు. ఈ సినిమా లో పనిచేసిన 24 క్రాఫ్ట్స్ నటీనటులు అందరు కృష్ణ నగర్ లో ఉన్నవారే. గతంలో నేను చాల మంది కొత్తవాళ్లను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశాను. చాల మంది సక్సెస్ అయ్యారు. మంచి పరిచయాలు ఉన్న నేను ఇప్పటివరకు 14 చిన్న సినిమాలు తెలుగు,తమిళం, మలయాళం భాషల్లో చేశాను. ఇక ఈ సినిమా కూడా విజయం సాధిస్తుంది అని నమ్మకం ఉంది. పాటలు చాలా బాగున్నాయి. ఈ 4 ఇడియట్స్ మంచి యూత్ ఫుల్ ఎంటర్టైనర్. వచ్చే నెల విడుదలకు సన్నాహాలు చేస్తున్నాను” అని తెలిపారు.


