‘సైరా’ని తమిళంలో రిలీజ్ చేస్తోన్న ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ !

‘సైరా’ని తమిళంలో రిలీజ్ చేస్తోన్న ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ !

Published on Sep 18, 2019 2:00 AM IST

సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో రుపొందుతున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా విడుదల కానుంది. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ప్రముఖ ప్రొడక్షన్ హౌస్, సూపర్ గుడ్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని తమిళంలో విడుదల చేస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం విడుదలకు సంబంధించి తమిళంలో విస్తృతమైన ప్రమోషన్లను ప్లాన్ చేస్తున్నారు సూపర్ గుడ్ ఫిల్మ్స్ వారు. తమిళ్ స్టార్ విజయ్ సేతుపతి సైరాలో కీలక పాత్రలో నటించడంతో.. తమిళంలో కూడా సైరా పై భారీ అంచనాలు ఉన్నాయి.

రేపు విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్ మీద అభిమానులు బోలెడు ఆశలు పెట్టుకున్నారు. ఎప్పుడెప్పుడు ట్రైలర్ బయటికొస్తుందా చూద్దామా అని వాళ్ళు ఎంతో ఆశగా చూస్తున్నారు. కాగా ఈ సినిమాలో సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, అనుష్క వంటి స్టార్ లు కూడా నటిస్తున్నారు. అందుకే సైరా కోసం తెలుగు ప్రేక్షకులే కాకుండా.. హిందీ, కన్నడ మరియు తమిళ ప్రేక్షకులు కూడా సినిమా పై ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుంది. భారీ బడ్జెట్ తో హీరో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో కూడా భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు