టాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వ‌నున్న‌.. కోలీవుడ్ సెన్షేష‌న్ ప్రొడ్యూస‌ర్..!

Published on Oct 31, 2018 9:36 am IST

ప్ర‌ముఖ త‌మిళ నిర్మాత సీవీ.కుమార్ కోలీవుడ్‌లో స‌క్సెస్‌ఫుల్ అండ్ సెన్షేష‌న్ నిర్మాత‌గా పేరుతెచ్చుకున్నారు. అయితే తాజాగా ఈ క్రేజీ ప్రొడ్యూస‌ర్ తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లోకి కూడా ఎంట‌ర్ అవుతున్నాడ‌ని స‌మాచారం. త్వ‌ర‌లోనే నేరుగా తెలుగులో త‌న బ్యాన‌ర్ ద్వారా ప‌లు చిత్రాలు నిర్మించ‌నున్నాడ‌ని తెలుస్తోంది. అందులో భాగంగా టాలెంట్ ఉన్న ప‌లువురు కొత్త ద‌ర్శ‌కుల‌కు అవ‌కాశం ఇవ్వ‌నున్నాడ‌ట సీవీ.కుమార్

ఇక సీవీ.కుమార్ విష‌యానికి వ‌స్తే అట్ట‌క‌త్తి చిత్రంతో నిర్మాత‌గా ఎంట్రీ ఇచ్చిన సీవీ. కుమార్ పిజ్జా, సూధు కవ్వుమ్ లాంటి సంచ‌ల‌న‌ చిత్రాల‌ను నిర్మించారు. ఇక సందీప్ కిష‌న్ నటించిన మాయావ‌న్ చిత్రంతో ద‌ర్శ‌కుడి అవ‌తారం ఎత్తిన సీవీ.కుమార్ మంచి విజ‌యాన్ని సాధించారు. ఇక ఈయ‌న నిర్మాణ సంస్థ ద్వారా, క‌బాలి ఫేం పా.రంజిత్, పిజ్జా ఫేం కార్తిక్ సుబ్బ‌రాజ్ లాంటి సెన్షేష‌న్ డైరెక్ట‌ర్ల‌ను చిత్ర‌ప‌రిశ్ర‌మ‌కి ప‌రిచ‌యం చేశారు సీవీ.కుమార్. ఇక‌ కోలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్ నిర్మాత‌గా పేరు తెచ్చుకున్న సీవీ.కుమార్.. మ‌రి టాలీవుడ్‌లో ఎలాంటి సంచ‌ల‌న చిత్రాలు నిర్మిస్తాడో చూడాలి.

సంబంధిత సమాచారం :