ఇక మ్యాన్ ఆఫ్ మాసెస్ ట్రీట్ పైనే అందరి కళ్ళు!

ఇక మ్యాన్ ఆఫ్ మాసెస్ ట్రీట్ పైనే అందరి కళ్ళు!

Published on May 19, 2026 7:02 AM IST

NTRNeel

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా పెద్ది తాలూకా ట్రైలర్ ఇప్పుడు వచ్చేసింది. ఇక ఈ ట్రైలర్ తర్వాత అంతా ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్న నెక్స్ట్ కంటెంట్ ఏదన్నా ఉంది అంటే అది మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ట్రీట్ అనే చెప్పాలి. దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో చేస్తున్న భారీ సినిమా ట్రీట్ వీడియోని ఇవాళ రాత్రి విడుదల చేయనున్న సంగతి తెలిసిందే.

దీనితో ఇక ఈ బ్లాస్ట్ కోసం అందరి కళ్లు ఎదురు చూస్తున్నాయి. సుమారు 4 నిమిషాల పైనే ఉన్న వీడియో గ్లింప్స్ లో మ్యాన్ ఆఫ్ మాసెస్ స్క్రీన్ ప్రెజెన్స్, రవి బసృర్ సంగీతం ప్రశాంత్ నీల్ టేకింగ్ ఏ లెవెల్లో ఉంటాయి అనే అంతా ఎగ్జైటెడ్ గా ఉన్నారు. సో తారక్ బర్త్ డే ట్రీట్ ఎలా ఉంటుందో చూడాల్సిందే. ఇక ఈ సినిమాకి ఎన్టీఆర్ ఆర్ట్స్, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

తాజా వార్తలు