ఈసారి రామ్ చరణ్ ఏం చేస్తాడో.?

RRR 6
ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ అప్డేట్ ను RRR యూనిట్ నేడు తెలపడంతో మరోసారి ఇండియన్ ఫిల్మ్ స్క్రీన్ అండ్ మన టాలీవుడ్ సినీ వర్గాల్లో ఒక్కసారిగా అంచనాలు భారీ ఎత్తున ఎగసాయి. తన విజువల్స్ తో భారీ స్థాయిలో ఎలివేషన్స్ ఇవ్వగలిగే జక్కన్న తారక్ మరియు చరణ్ లతో చేస్తున్న ఈ RRR చిత్రం కోసం చాలా మందే ఎదురు చూస్తున్నారు.

అయితే గత కొంత కాలంలో ఈ చిత్రంలో అల్లూరిగా కనిపిస్తున్న చరణ్ కోసం కొమరం భీం రోల్ చేస్తున్న తారక్ ఒక సాలిడ్ గిఫ్ట్ ను టీజర్ తో ఇచ్చాడు. దానికి ఊరమాస్ రెస్పాన్స్ వచ్చింది. పైగా అందులో తన వాయిస్ ఓవర్ లో ఇచ్చిన ఎలివేషన్ మరోస్థాయికి తీసుకెళ్లింది. ఇక ఇపుడు చరణ్ వంతు వచ్చింది. అప్పుడు తారక్ గిఫ్ట్ ఇస్తే ఈసారి చరణ్ వంతు వచ్చింది.

దీనితో చరణ్ నుంచి ఎలాంటి గిఫ్ట్ వస్తుందా అని అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వీటితో పాటుగా చరణ్ వాయిస్ ఓవర్ కూడా ఉంటుందా ఉండదా అని అనుకుంటున్నారు. మరి భీం కోసం రామరాజు ఏం చేస్తాడో తెలియాలి అంటే వచ్చే అక్టోబర్ 22వరకు ఆగాల్సిందే.

Exit mobile version